Corona in AP: ఏపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 495 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా, 495 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 99, కృష్ణా జిల్లాలో 77 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

ఏపీలో గడచిన 24 గంటల్లో 22,383 శాంపిల్స్ పరీక్షించగా, 495 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 106 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 99, కృష్ణా జిల్లాలో 77 కేసులు వెల్లడయ్యాయి. విశాఖపట్నంలో 55, గుంటూరులో 40, ప్రకాశం జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 31 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,543 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,525 మంది కరోనా బారినపడగా, వారిలో 22,92,396 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,421 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,708కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement