Coronavirus in AP: ఏపీలో బాగా తగ్గిపోయిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 57 మందికి కరోనా, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు
ఏపీలో కొవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఏపీలో కొవిడ్ మహమ్మారి ప్రభావం క్షీణదశకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 11,980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.
అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,522 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మృత్యువాతపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement