Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 69 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా... ఒక్క మరణం కూడా సంభవించలేదు.

Representative image

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా... ఒక్క మరణం కూడా సంభవించలేదు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,19,012కి చేరుకుంది. ఇప్పటి వరకు 23,03,772 మంది కరోనా నుంచి కోలుకోగా... మొత్తం 14,730 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,32,91,315 శాంపిల్స్ ని పరీక్షించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement