Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఇన్నోవా కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు

అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

Car Hit a Tree in Vinukonda, Three people died

పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి సోమసి బాలగంగాధర్‌ శర్మ(78), ఆయన సతీమణి యశోద(67), డ్రైవర్‌ మృతి చెందారు.   దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

బాలగంగాధర్‌ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తిక్‌, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శర్మ, అనుపమ పరిస్థితి విషమంగా ఉందని పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)