Vizag Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి
పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు.
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగనంపూడి టోల్ గేట్ వద్ద బైక్ ని లారీ ఢీ కొట్టడంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెందిన గొర్లి మన్మధరావు(41), అరుణకుమారి(34) దంపతులు అగనంపూడి పరిధి కర్రివానిపాలెంలో నివాసం ఉంటున్నారు. మన్మధరావు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.
బ్యాంకు పనిమీద దంపతులిద్దరు ద్విచక్రవాహనంపై గాజువాక వెళుతుండగా అదే మార్గంలో వెనుక నుంచి టిప్పర్ లారీ (Vizag Road Accident) ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మరో ఘటనలో ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ వద్ద డైవెడర్ ని ఢీ కొట్టి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న వారికి గాయాలు అయ్యాయని సమాచారం.
Vizag Road Accident: