Guntur Road Accident: గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా, ఆరుగురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు, ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు.
News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)