Andhra Pradesh Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు, దాని వెనుకే టాటా ఏస్ వాహనం, ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెడీమిక్స్ వాహనం మరమ్మతులకు గురవడంతో పెదకాకాని క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట జాతీయ రహదారిపై మార్జిన్‌లో డ్రైవర్ నిలిపారు. విజయవాడ నుంచి గుంటూరుకి అతి వేగంగా వస్తున్న కారు రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది.
దీని వెనుక ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం అతివేగంగా కారును, రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, టాటా ఏస్ వాహనంలో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, మరొకిరిక తీవ్ర గాయాలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)