Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు, బస్సులో 40 మంది ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా తోటచర్ల గ్రామ శివారు 65వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో మొత్తం పది మందికి గాయాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు విజయనగరం వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, 10 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు.

Andhra Pradesh Road Accident

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా తోటచర్ల గ్రామ శివారు 65వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో మొత్తం పది మందికి గాయాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు విజయనగరం వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, 10 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఎన్‌హెచ్ 65పై ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.10 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు కాగా వారిని నందిగామ, విజయవాడ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళుతోంది. సహాయక చర్యలు చేపట్టామని నందిగామ ఏసీపీ జనార్దన్ నాయుడు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నడిగామ ఏఎస్పీ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement