Visakhapatnam Road Accident: ఎవరో చేసిన తప్పుకు అభం శుభం తెలియని చిన్నారులు... విశాఖపట్నం రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్ ఇదిగో..

వీడియో షేర్ చేస్తూ.. విశాఖపట్నంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి.

VC Sajjanar on Road Accident

Visakha, Nov 22: విశాఖ నగరంలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటో సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకువస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది.ఆటో బోల్తా పడగా అందులోని చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీడియో షేర్ చేస్తూ.. విశాఖపట్నంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. ఎవరో చేసిన తప్పుకు అభంశుభం తెలియని చిన్నారులు గాయాల పాలై వారు క్షోభను అనుభవించడం చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి.

అజాగ్రత, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ఈ ఫుటేజిని చూస్తే తెలుస్తోంది. తల్లిదండ్రుల్లారా...! పిల్లల సురక్షిత రవాణాపై ఆలోచన చేయండి. ప్రైవేట్ వాహనాల్లో స్కూళ్లకు పంపి.. చిన్నతనంలోనే వారిని ప్రమాదాల పాలు చేయొద్దని తెలిపారు.

VC Sajjanar on Visakhapatnam Road Accident

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)