School Bus Accident Video: వీడియో ఇదిగో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, ఒక్కసారిగా బోల్తాపడిన స్కూల్ బస్, 15 మంది విద్యార్థులకు గాయాలు
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడపడం వల్ల స్కూల్ బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ బస్సు నడపడం వల్ల స్కూల్ బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్రు వద్ద చోటు చేసుకుంది. 66 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు పమిడిమర్రు వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు, అరుపులు వేయడంతో స్థానికులు వచ్చి విద్యార్థులకు సురక్షితంగా బయటకు తీశారు.
వీరిలో 15 మంది విద్యార్థులకు గాయాలు కాగా మరో విద్యార్థి కాలికి తీవ్ర గాయం అయ్యింది. గాయపడ్డ విద్యార్థులను నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రి (Private Hospital)కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్(Cell phone) మాట్లాడుతూ నడపడమే ప్రమాదానికి కారణమని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ వెల్లడించారు.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)