Andhra Pradesh: కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ వెనుక ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన 27 బైకులు,నాలుగు కార్లు,ఒక ఆటో, ఘటనపై దర్యాప్తు చేస్తున్న విశాఖ పోలీసులు

విశాఖపట్నం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ వెనుక భద్రపరిచారు. ఆ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

విశాఖపట్నం కంచరపాలెం పోలీస్‌ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ వెనుక భద్రపరిచారు. ఆ వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక.. సమీపంలోని ఇండస్ట్రియల్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 27 ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. అగ్నికి ఆహుతైన వాహనాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement