Andhra Pradesh Shocker: కడపలో దారుణం, భార్యతో సహా ఇద్దరు పిల్లలను తుఫాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, వ్యక్తిగత కారణాలే కారణమని తెలిపిన కడప డీఎస్పీ షరీఫ్‌

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు

Constable commits suicide (Photo-Video Grab)

కడపలో కో-ఆపరేటివ్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్‌ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Constable commits suicide

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement