Andhra Pradesh Shocker: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపి తలను తినేసిన సింహం, దాడి చేసిన సింహన్ని బోనులో బంధించిన అధికారులు

తిరుమల తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జూపార్క్‌‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది. దాడి చేసిన సింహన్ని జంతు ప్రదర్శన శాల అధికారులు బోనులో బంధించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్‌(34)గా గుర్తించారు.

Lion kills man in Tirupati Zoo Park (photo-Video Grab)

తిరుమల తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జూపార్క్‌‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది. దాడి చేసిన సింహన్ని జంతు ప్రదర్శన శాల అధికారులు బోనులో బంధించారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్‌(34)గా గుర్తించారు.

సమాచారం అందుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్‌ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement