Andhra Pradesh: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు, ఒడ్డుకు కొట్టుకువచ్చిన మూడు మృతదేహాలు, మరొకరి కోసం గాలింపు చర్యలు
ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు.
బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడగా తాజాగా ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
జూన్ 21న శుక్రవారం ఏలూరుజిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు రామాపురం బీచ్‌లో విహారయాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్ళారు. స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్ళాల్లో తెలియక సముద్రంలో కొంతదూరం వెళ్ళారు. పెద్ద అలలు రావడంతో 11 మంది విద్యార్దుల్లో 4గురు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్ధులు నితిన్ (21), అమలరాజు( 22), తేజ( 24), కిషోర్( 22)లుగా గుర్తించారు. కొద్దిసేపటికి వీరిలో మూడు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ధి మృతదేహం కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.
Here's Video and Images