Stones Pelted on Vande Bharat Train: విశాఖలో వందేభారత్ రైలుపై ఆగంతకులు రాళ్ల దాడి, రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసం
కంచరపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేశారు.
విశాఖపట్నంలో వందేభారత్ రైలు బోగీలపై గుర్తు తెలియని ఆగంతకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంచరపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో రాళ్లు తగిలి రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేశారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించాల్సి ఉంది.అందులో భాగంగానే ట్రయల్ కోసం చెన్నై నుంచి విశాఖ వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డీఆర్‌ఎం అనూప్ సత్పతి ఘటనపై విచారణకు ఆదేశించారు. రాళ్లదాడిని వాల్తేరు డివిజన్ అధికారులు నిర్ధారించారు.
Here's ANI Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)