AP Assembly Session 2022: వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ సర్కారును రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ వినూత్న నిరసనకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేతృత్వం వహించారు. అంతేకాకుండా ఎడ్ల బండి కాడిని ఆయన తన భుజంపై పెట్టుకుని మోశారు. రైతు ద్రోహిగా నిలుస్తున్న సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)