Nara Lokesh's Padayatra: లోకేష్ పాదయాత్రలో పోలీసులు,టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, మీ సొంత రాజ్యాంగంతో మాకు పనిలేదని నారా లోకేష్ విమర్శలు

యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు.

TDP leader Nara Lokesh's padayatra (Photo-ANI)

యువగళం’ (Yuvagalam) పాదయాత్రలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి 14వ రోజు లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించారు.సంసిరెడ్డిపల్లెలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా సేపు స్టూల్‌పైనే నిలుచుని నిరసన తెలిపిన లోకేశ్‌.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మాది అంబేడ్కర్‌ రాజ్యాంగం. మమ్మల్ని అడ్డుకోమంటున్న మీ సొంత రాజ్యాంగంతో మాకు పనిలేదని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement