Andhra Pradesh: వీడియో ఇదిగో, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత, రిజర్వాయర్‌కు క్రమంగా పెరుగుతున్న వరదప్రవాహం
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగడంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలు ఉంది. వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు
శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ప్రత్యేక పూజలు చేసి.. జలహారతి ఇచ్చారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)