Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దిరకి గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. తెర్లాం మండలంలోని టెక్కలి వలస దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకునంది. బైక్, స్కూల్ బస్ ఢీ కొన్నాయి. ప్రమాద స్థలంలోనే ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. తెర్లాం మండలంలోని టెక్కలి వలస దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకునంది. బైక్, స్కూల్ బస్ ఢీ కొన్నాయి. ప్రమాద స్థలంలోనే ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువుల రోదనలతో ఘటనస్థలి శోకసంద్రాన్ని తలపిస్తోంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారని సమీపంలో ఓ గ్రామంలో జాతరకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సూరజ్‌పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 నెలల పాప ఆన్షిక ఈ ఘటనలో దుర్మరణం పాలైంది.గుడిసెలో నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చిన ఆ పాప.. రోడ్డుపై ఉండగా అటుగా వచ్చిన ఒక ట్రక్కు ఆమెను తొక్కేసింది. విషయం తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సదరు ట్రక్కు హర్యానాలో రిజిస్టర్ అయినట్లుగా అధికారులు గుర్తించారు.
‘‘ట్రక్కు కింద పడి పాప చనిపోయిన ఘటనపై కేసు నమోదు చేశాం. ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది’’ అని సూరజ్‌పూర్ పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్ లేదా పబ్లిక్ దారిలో వాహనం నడపడం), సెక్షన్ 304 ఏ (నిర్లక్ష్యంతో మరణానికి కారణమవడం) కింద కేు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)