Fire Accident in Tirupati: తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు మృతి, మరో ఇద్దిరికి గాయాలు, టపాకాయల నిల్వ కేంద్రంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి

Representative image (Photo Credit: Pixabay)

తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకటవ గ్రామంలో టపాకాయల నిల్వ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టపాసుల గోదాం నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.. ఈ ఘటనలో ఏడుకొండలు (37), నాగేంద్రబాబు (35) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది. కళ్యాణ్ (22) వీరయ్య (48) అనే ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement