Andhra Pradesh Tragedy: కాకినాడలో ఘోర ప్రమాదం, ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతి, ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులు

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలోని ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

Representational Image (Photo Credits: Twitter)

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలోని ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయిదుగురు పాడేరు వాసులు కాగా మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15 రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు తెలుస్తోంది.

Here's Ntv Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement