Andhra Pradesh: నలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు వార్త అంతా అబద్దం, ఆ ఘటనకు ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన FactCheck.AP.Gov.in
నలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు"అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని FactCheck.AP.Gov.in తెలిపింది. ఆ జనరేటర్ కూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పర్యటనకూ ఎలాంటి సంబంధమూ లేదు. సీఎం గారి పర్యటనకు జరిగే ఏర్పాట్ల వల్ల ఆ దుర్ఘటన జరగలేదు.
నలుగురిని బలిగొన్న సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు"అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని FactCheck.AP.Gov.in తెలిపింది. ఆ జనరేటర్ కూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి పర్యటనకూ ఎలాంటి సంబంధమూ లేదు. సీఎం గారి పర్యటనకు జరిగే ఏర్పాట్ల వల్ల ఆ దుర్ఘటన జరగలేదు.తమ గ్రామంలో జరిగే ఓ ఉత్సవానికి చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామస్థులు తెనాలి నుంచి ఆ జనరేటర్ అద్దెకు తెచ్చారు. అంతేకానీ అది సీఎం గారి పర్యటనకు తెచ్చింది కాదు. ప్రమాదంలో ఇద్దరు మరణించడం,10 మంది గాయపడటం దురదృష్టకరం.అలాగే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల్లో సరైన వైద్యం అందక మరో ఇద్దరు మృతి అని ప్రసారం చేశారు. ఇది కూడా అవాస్తవం. ఈ దుర్ఘటనలో మొత్తంగా మరణించింది ఇద్దరే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమైన వార్త పూర్తిగా అవాస్తవమని తెలిపింది.
Here's FactCheck.AP.Gov.in Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)