Andhra Pradesh: లవ్వా..కొవ్వా, పట్టపగలే నడిరోడ్డు మీద బరితెగించిన లవర్స్,పోలీసుల చేతికి చిక్కడంతో కుమ్ముడే కుమ్ముడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
విశాఖలొ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు అడ్డంగా చిక్కిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్‌రయ్ అంటూ దూసుకుపోయారు.
విశాఖలొ స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు అడ్డంగా చిక్కిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్‌రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది
నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
Here's Viral Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)