Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇలాకాలో జల్లికట్టు పోటీలు, ఎద్దు ఢీకొట్డడంతో యువకుడు అక్కడికక్కడే మృతి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరులో ఆదివారం జల్లికట్టు క్రీడోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. జల్లికట్టు క్రీడల్లో భాగంగా ఎడ్లు పరుగెత్తుతుండగా వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దు ఎదురుగా వచ్చిన యువకుడిని బలంగా ఢీకొట్డడంతో అతడు ఎగిరి కిందపడ్డాడు. కుప్పకూలిపోయిన అతడిని చూసి గ్రామస్తులు, అతడి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. మృతుడిని అడవి బూదుగూరు గ్రామానికి చెందిన కరుణాకరన్ గా గుర్తించారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అనుమతి లేకుండానే భారీగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. జల్లికట్టు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కుప్పం డీఎస్పీ పార్థసారథి చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
young man died after being hit by a bull during Jallikattu
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)