Nallagatla Swamidas: వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్‌ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు.

Nallagatla Swamidas (photo-ANI)

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్‌ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు. చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గతంలో లగడపాటి టీడీపీని ముంచినట్లు ఇప్పుడు ఆరా మస్తాన్ సైతం వైసీపీని ముంచాడన్నారు.

దాదాపు 3 దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన స్వామిదాసు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు . 1994, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నల్లగట్ల స్వామిదాసు. తెలుగుదేశం అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.  పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం రెండు రోజుల క్రితం ఐపాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్‌ ఓ పనికి మాలిన సంస్థ అని..అందులో ఉన్న వారంతా డిగ్రీలను అడ్డుకుని జగన్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయామన్నారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement