Kakani Govardhan Reddy on MPs Resignation: పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, ఎవరు వెళ్లినా జగన్‌కు నష్టమేమి లేదని తెలిపిన కాకాణి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరునున్న మోపిదేవి
గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడుకు చివరికి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిన విషయాన్ని ఈ సందర్భంగా కాకాని గుర్తు చేశారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా..? అని ప్రశ్నించారు. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారని, ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోయారని, పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)