Y.V. Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి, స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని తెలిపిన వైసీపీ నేత

బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

two-days-vaikunta-dwara-darshanam-tirumala-says-yv-subba-reddy (Photo-Twitter)

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా టీటీడీ ఛైర్మన్‌గా ఆయనకు మరోసారి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో టీటీడీ బోర్డు సభ్యులను నియమిస్తామని ఇటీవల ప్రకటించింది. స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 జూన్‌ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)