AP Assembly Session 2023: బాలకృష్ణకు మెంటల్ ఉంది కాల్పులు జరుపుతాడేమో, అసెంబ్లీలోకి రానివ్వకండి అధ్యక్షా, వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ వేయడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ వేయడం బాలయ్యకే చెల్లిందన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని...ఆయనను ఆస్పత్రికి తరలిస్తే మంచిదని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా డైలాగులను మధుసూదన్ రెడ్డి సభలో వినిపించారు. ఫ్లూటు జింక ముందు ఊదు..జింక లాంటి మీ బావ చంద్రబాబు ముందు ఫ్లూట్ ఊదుకోవాలి..సింహం లాంటి సీఎం వైఎస్ జగన్ రెడ్డి ముందు ఊదకండి అంటూ మధుసూదన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు సైకో..ఆయన తమ్ముడికి మెంటల్ ఉందని, బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బాలకృష్ణ సభలో కాల్పులు జరిపే అవకాశం ఉందని.. ఆయనను బయటకు పంపించాలని సూచించారు. అంతేకాదు టీడీపీ సభ్యులను మానసిక ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)