AP Assembly Session 2023: అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు.

Speaker Tammineni Sitaram warned Balakrishna for twirling his mustache in the assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అంబటి వైపు చూస్తూ తొడగొట్టి.. మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు.

టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు.ఏపీ అసెంబ్లీ నుండి 14 మంది టీడీపీ సభ్యులని ఒక్కరోజు, ముగ్గురిని ఈ సెషన్ మొత్తం స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

Speaker Tammineni Sitaram warned Balakrishna for twirling his mustache in the assembly

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement