Goreti Venkanna Bags Sahitya Akademi Award: గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు, ఆయన ప్రజల హృదయాలు గెలిచారంటూ ట్వీట్

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎంఓ గురువారం ట్వీట్‌ చేసింది.

Telangana MLC Goreti Venkanna (Photo-Facebook)

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కు ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం ’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ సీఎంఓ గురువారం ట్వీట్‌ చేసింది. సామాన్యుడికి చేరేలా హావభావాలతోటి గ్రామీణ జానపదాలతో ఆయన ప్రజల హృదయాలు గెలిచారని, ఒక లెజెండరీగా ఎదిగారని సీఎం తెలిపారు. వారి ప్రజా గేయాలు ఈనాటికీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతాయని ట్వీట్ లో పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now