#HonorToAPVolunteers: గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్యూట్‌ చేసిన సీఎం జగన్, వారికి ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర క్యాటగిరీల్లో వాలంటీర్లకు సత్కారం

ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం ‘వాలంటీర్లకు వందనం’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌. లాంఛనంగా 9 మంది వాలంటీర్లను సత్కరించి, సేవా పురస్కారాలు అందజేసిన సీఎం వైయస్‌ జగన్‌. ఇది ఈ ఒక్క సంవత్సరంతో ఆగిపోదు. ప్రతి ఏడాది ఉగాది నాడు ఈ కార్యక్రమం చేపడతామని సీఎం తెలిపారు.

Honor To AP Volunteers (Photo-Twitter)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నవరత్నాలను. సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. వారి సేవలకు సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

వాలంటీర్ల తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని, రాష్ట్రంలో పరిపాలన అంటే ఏమిటో చూపించామని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే, వాలంటీర్ వ్యవస్థలపై విపక్షాలు దారుణంగా మాట్లాడుతున్నాయని అన్నారు. పండ్లు ఇచ్చే చెట్లపైనే రాళ్లు పడతాయని, నిజాయతీగా పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement