AP Elections Result 2024: వీడియో ఇదిగో, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న టీడీపీ కూటమి
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది, అధికార వైసీపీ వెనుకంజలో ఉంది.
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది, అధికార వైసీపీ వెనుకంజలో ఉంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమి దిశగా సాగుతున్నారు. అలాగే గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వెనుకంజలో ఉన్నారు. కాగా మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోయారు. మంగళగిరిలో దూసుకుపోతున్న నారా లోకేష్, పిఠాపురంలో ముందంజలో పవన్ కళ్యాణ్, మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)