Pawan Kalyan vs Jagan

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ముందంజలో దూసుకు వెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 12 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. లోకేశ్ దూకుడు ముందు వైసీపీ అభ్యర్థి ఎం.లావణ్య నిలబడలేకపోతున్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి లావణ్యపై 12,121 ఓట్లతో లోకేశ్ లీడ్ లో కొనసాగుతున్నారు.  మెజారిటీ సీట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి, వెనుకంజలో పడిన వైసీపీ, ఎవరెక్యడ ఆధిక్యంలో ఉన్నారంటే..

నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా ఫలితాల్లో వెనుకబడ్డారు. తొలి రౌండ్ ముగిసే సరికి రోజా సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత యరపతినేని 1,311 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.మాచర్ల నుంచి టీడీప అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు. అటు, గురజాలలోనూ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు లీడింగ్ లో ఉన్నారు. ఓవరాల్ గా టీడీపీ 90, వైసీపీ 13, జనసేన 11, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.పిఠాపురంలో 2 రౌండ్లు ముగిసేసరికి పవన్ కళ్యాణ్ 8500 ఓట్లతో ముందంజలో ఉన్నారు.