AP Election Results 2024: ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగ బద్ధమైనదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగ బద్ధమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఓటములు కొత్తేమీ కాదు, తట్టుకుని నిలబడి గెలిచాం, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ భావోద్వేగం, ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌సీపీ ఎదుర్కొన్న ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సి ఉందని, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలకు నచ్చనిది తాము ఏం చేశాం? తాము చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదు? అనే విషయాలను కూలంకషంగా చర్చిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గ నాయకులు, నేతలు ప్రతి ఒక్కరితో సమీక్షలు నిర్వహించిన అనంతరం తమ పార్టీ అధ్యక్షుడు తదుపరి కార్యాచరణను చేపడతారని విజయసాయి రెడ్డి ప్రకటించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)