Gudivada Election Result 2024: గుడివాడలో కొడాలి నానికి ఘోర పరాభవం, 51 వేల పై చిలుకు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఘన విజయం
గుడివాడలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నానికి ఘోర పరాభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 50 వేల పై చిలుకు ఓట్లతో కొడాలి నానిపై గెలుపొందారు. పోటీ చేసిన ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా తెలుస్తోంది.
గుడివాడలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నానికి ఘోర పరాభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 51 వేల పై చిలుకు ఓట్లతో కొడాలి నానిపై గెలుపొందారు. పోటీ చేసిన ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ సునామీలో సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి కూడా గల్లంతయ్యారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలయ్యారు. కమలాపురం టీడీపీ అభ్యర్థి పి.కృష్ణచైతన్య రెడ్డి తిరుగులేని విజయం అందుకున్నారు. వైసీపీ కంచుకోట కడప జిల్లాలో ఎగిరిన టీడీపీ జెండా, 5 వేలకు పైచిలుకు ఆధిక్యంలో రెడ్డప్పగారి మాధవిరెడ్డి
17 రౌండ్ల అనంతరం కృష్ణచైతన్య రెడ్డి 23,063 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 17 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్య రెడ్డికి 88,853 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి 65,790 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇంకా మరొక్క రౌండ్ లెక్కింపు మిగిలుంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)