వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్రస్తుతం ఆమెకు 5 వేలకు పైచిలుకు ఆధిక్యంలో ఉండగా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లుపై టీడీపీ నేత వరదరాజులరెడ్డి గెలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం, 69,169 ఓట్ల మెజార్టీతో వంగా గీతపై విక్టరీ నమోదు చేసిన జనసేన అధినేత
అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్ (టీడీపీ), పత్తిపాడులో సత్యప్రభ (టీడీపీ), రాజానగరంలో బత్తుల రామకృష్ణ (జనసేన), తణుకు- ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ), గాజువాకలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై పల్లా శ్రీనివాస రావు విజయం సాధించారు. అటు ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల్ విజయ్ గెలుపొందారు. అలాగే ఉండిలో రఘురామకృష్ణరాజు (టీడీపీ), భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు 66 వేల మెజార్టీతో గెలిచారు.