AP GIS 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌, శాఖల వారీగా ఏపీకి వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవిగో..పరిశ్రమల విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

AP GIS 2023 (Photo-CMO AP Twitter)

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు.

శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు

► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు

► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు

► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు

► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు

► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు

► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు

Here's AP CMO Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement