Increased Pensions in AP: పింఛన్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. రూ.3 వేల పింఛన్ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం
గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్ పై మూడో సంతకం చేశారు.
Vijayawada, June 14: ఆంధ్రప్రదేశ్ లో (AP) పింఛన్ల పెంపుపై (Increased Pensions in AP) రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్ పై మూడో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాలతో ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్.. ఒకేసారి రూ.4 వేలకు పెరుగనున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)