MLC Parvartha Reddy Car Accident: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారుకు ప్రమాదం.. ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే మృతిచెందిన పీఏ.. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం (వీడియో)
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఆయనకు గాయాలయ్యాయి.
Vijayawada, Jan 5: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (MLC) పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (Parvartha Reddy Chandrashekhar Reddy) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యింది. గురువారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఆయనకు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ పీఏ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడినవారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్‌పై పడిపోయిందని వివరించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement