AP MPTC & ZPTC Elections 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ , ఓటు వేయడానికి తరలివస్తున్న ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Polls 2021 | (Photo-PTI)

జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పరిషల్‌ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement