Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

AP police Arrested Former MLA Vallabhaneni Vamsi(X)

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్(Vallabhaneni Vamsi arrest) చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై(TDP Office) దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. వాస్తవానికి ఈ కేసులో వంశీని అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్ కూడా దాఖలు చేశారు వంశీ(Vallabhaneni Vamsi). అయితే వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది.

వీడియోలు ఇవిగో, విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, సితార గ్రౌండ్స్‌ జలకన్య ఎగ్జిబిషన్‌ ఒక్కసారిగా ఎగసిన మంటలు

2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. ఈ కేసులో వంశీతో పాటు పలువురు వైసీపీ నేతల(YSRCP Leaders)పై కేసు నమోదుకాగా ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement