విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident at Vijayawada Sitara Center) జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దారుణం, భార్యభర్తల గొడవ కేసులో దూరిన కానిస్టేబుల్, ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదుదారు భర్తను చితకబాదిన వీడియో ఇదిగో..

స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడలోని సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Vijayawada Fire Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)