AP Coronavirus: ఏపీలో తాజాగా 993 మందికి కరోనా, నాలుగు జిల్లాల్లోనే అధికం, ముగ్గురు మృతితో 7,213కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, రాష్ట్రంలో 6,614 యాక్టివ్ కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 30,851 మందికి టెస్టులు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. గుంటూరు జిల్లాలో 198 కేసులు, చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖపట్నం జిల్లాలో 169 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి (Covid Deaths) చెందారు. ఇదే సమయంలో 480 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus (Photo Credits: IANS)

తాజా గణాంకాలతో కలిపి కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. మొత్తం 9,00,805 మంది కరోనా బారిన పడగా... 8,86,978 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. మాస్క్ ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తోంది.

Here's AP Covid Report:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement