Speaker Ayyanna On Jagan: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ బెదిరించారు.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు, హైకోర్టు పిటిషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారు అని మండిపడ్డారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna On Jagan) స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారు అని మండిపడ్డారు. హైకోర్టు స్పీకర్ కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. అయితే.. జగన్(YS Jagan) వేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనేది హైకోర్టు నిర్థారణ చేయలేదు అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు(Nara Lokesh). డిప్యూటీ సీఎం కంటే జగన్ కే ఎక్కువ భద్రత ఉందన్నారు. ఉపముఖ్యమంత్రికి Z కేటగిరి భద్రత ఉంటే.. జగన్ కు Z+ కేటగిరి సెక్యూరిటీ ఉందన్నారు. ప్రతిపక్ష హోదాపై లోక్‍సభ రూల్స్ లో క్లియర్ గా ఉందని.. గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అన్నారు.
ఇక 6వ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 19 ఏళ్ళు నిండిన మహిళలకు ఆర్థిక సహాయం హామీ అమలుపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు శాసన మండలి చైర్మన్.
AP Speaker Ayyanna Serious on YS Jagan
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)