APJ Abdul Kalam Death Anniversary: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి, కలాం చేసిన కృషి వెలకట్టలేనిది, ఆయన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలాంను స్మరించుకున్నారు.
దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్ భారత్ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలాంను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. అబ‍్దుల్ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు.
Here's AP CM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)