Fire in ATM Center: అగ్నికి ఆహుతైన ఎస్బీఐ ఏటీఎంలు, అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు, పెద్ద శబ్దంతో పేలిపోయిన ఏటీఎంలు

అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎంలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడి ఏటీఎం కేంద్రం వద్ద ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ మంటలు ఏటీఎం కేంద్రం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఏటీఎం మెషీన్లు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు హడలిపోయారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

ఈ ఘటనలో ఏటీఎం మెషీన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఏటీఎంలో మంటలు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement