Khushbu on Bandaru Comments: వీడియో ఇదిగో, రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు, క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని తెలిపిన నటి ఖుష్బూ
జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు ఖుష్బూ విమర్శలు గుప్పించారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని చెప్పారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమని అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)