Chandrababu: మనవడు దేవాన్ష్‌ను చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు, దగ్గరకు తీసుకుని బుగ్గలు చిదుముతూ ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్

ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

Chandra babu Naidu and Grand son (Photo-X/TDP)

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. చంద్రబాబు విడుదల అవుతున్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబు కోసం వేచిచూశారు.

భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

Chandra babu Naidu and Grand son (Photo-X/TDP)

Here's TDP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)