Chandrababu Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు.

Chandrababu Visits KCR in Hospital

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్‌ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ‘‘ ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్‌ చేశారు. త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారు’’ అని చంద్రబాబు అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు