Chandrababu Released from Rajahmundry Jail: వీడియో ఇదిగో, 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.
రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.
తమ అధినేత విడుదల కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబు ఈ రోజు విడుదల అయ్యారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)